TIRUPATI: తిరుమల వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు!
జనవరి 10 వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీచేసేందుకు తిరుపతిలో కేంద్రాలు సిద్ధం చేస్తోది టీటీడీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు సహా తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు
జనవరి 10, 11, 12 తేదీలకు జనవరి 9న టోకెన్లు జారీచేస్తారు..ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు
తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టోకెన్లు జారీ చేస్తారు
తిరుమల స్థానికుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
టోకెన్లు పొందిన భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు.. ఈ 10 రోజుల పాటూ సామాన్య భక్తుల సౌకర్యార్థం సిఫార్సు లేఖలను రద్దు చేశారు.
మొదటి మూడు రోజులకు జనవరి 9న టోకెన్లు ఇస్తారు...తర్వాత 7 రోజులకు ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తారు