Satyabhama Serial Today January 1st Highlights: క్రిష్ తో రొమాన్స్..మామతో సవాల్.. సత్యకి మద్దతుగా సంతకం చేసేదెవరు - సత్యభామ జనవరి 1 ఎపిసోడ్ హైలెట్స్!
సత్య MLA గా పోటీ చేస్తుందని తెలిసి విశ్వనాథం కుటుంబం మొత్తం కంగారుపడతారు. నందిని మాత్రం వదిన గెలిచేవరకూ తగ్గదు అంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహదేవయ్య రాజకీయ ప్రత్యర్థి నర్సింహం సంతోషిస్తాడు..సత్య ఎంట్రీతో ఓట్లు చీలుతాయి తన గెలుపు పక్కా అని ఫిక్సవుతాడు
మహదేవయ్యకి పార్టీ ప్రెసిడెంట్ కాల్ చేసి నీ కోడలు పోటీచేయడం ఏంటని నిలదీస్తాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయితే నీకే నష్టం.. అప్పుడు నా వెంట పడితే నేను ఏమీ చేయలేను అని క్లాస్ వేస్తాడు
నీ చిన్నకోడలి ఓవరాక్షన్ కి నెత్తినొప్పి వస్తోందంటాడు మహదేవయ్య. ఇప్పుడు నీ పార్టీ ఇన్ ఛార్జ్ కాదు..బయటోళ్లు కాల్ చేస్తే ఏం చెబుతావ్ అని క్వశ్చన్ చేస్తుంది భైరవి. అది పోటీపేరుతో ఇంట్లో బాగోతాలు బయపెట్టాలని చూస్తోందని నిందవేస్తుంది భైరవి.
విశ్వనాథంకి కాల్ చేసిన మహదేవయ్య..నీ కూతురు బుద్ధిమని చెప్పా ఏం చేశావ్ అని అడుగుతాడు. తండ్రీ కూతుర్లకు నేనంటే భయం లేదుకదా మీ ఇంట్లో సునామీకి కారణం నేనే అని మీకు మీ కూతురు చెప్పి ఉంటుంది కదా...పిచ్చి నాటకాలు ఆపకపోతే లెక్కలు మారిపోతాయ్ అని బెదిరిస్తాడు
మల్లెపూలు పెట్టుకొచ్చి క్రిష్ ని కవ్విస్తుంది సత్య..క్రిష్ భయపడి బయటకు వెళ్లిపోతాడు. బామ్మ కూడా తిట్టి క్రిష్ ని లోపలకు పంపిస్తుంది.
మరోవైపు నందిని ఆ రౌడీ తన తండ్రి గురించి చెప్పిన విషయం గురంచి ఆలోచించి..ఇలాంటి తండ్రిని ఇచ్చావేంటి దేవుడా అని బాధపడుతుంది. ఇంతలో హర్ష వచ్చి కష్టాలు తీరాయి అనుకుంటే సత్య ఏంటి మీ నాన్నకి ఎదురుతిరుగుతోంది అంటాడు. మనమే సత్యకి సపోర్ట్ చేయాలి అంటుంది
సత్య భైరవి, మహదేవయ్యలకు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది.. చంపెయ్ మా పీడ నీకు ఉండదు అంటుంది భైరవి. నామినేషన్ ముహూర్తం పెట్టించుకోవాలి అంటుంది సత్య. నీలా ఇండిపెండెంట్ గా పోటీచేసేవాళ్లకి పది మంది సపోర్ట్ గా సంతకాలు పెట్టాలి అంటాడు..
సత్యభామ జనవరి 02 ఎపిసోడ్ లో... నందిని మహదేవయ్యని నిలదీస్తుంది.. ఏం సమాధానం చెబుతాడో చూడాలి...