Diwali 2024 Dhanteras Special: శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చిన రోజే ధనత్రయోదశి - ఈ రోజు బంగారం పెట్టి పూజిస్తే!
ఐదు రోజుల పండుగగా జరుపుకునే దీపావళి...ధనత్రయోదశితో మొదలవుతుంది. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం సెంటిమెంట్ గా భావిస్తారు. దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appత్రిమూర్తులులో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని భావించిన భృగుమహర్షి వారి దగ్గరకు పయనమవుతారు. వైకుంఠానికి వెళ్లిన మహర్షి రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహం చెందిన భృగుమహర్షి..శ్రీహరి వక్షస్థలంపై కాలితో తంతాడు
ఆ సమయంలో స్వామీ మీ పాదం ఎంత నొచ్చుకుందో అని పాదం పట్టుకున్న నారాయణుడు భృగుమహర్షి అరికాలిలో ఉన్న అహంకార నేత్రాన్ని చిదిమేస్తాడు. అప్పటికి సాధారణ స్థితికి వచ్చిన భృగుమహర్షి శ్రీహరిని శరణు కోరతాడు.
తాను కొలువుండే వక్షస్థలంపై మహర్షి కాలితో తన్నడాన్ని సహించలేకపోయిన శ్రీ మహాలక్ష్మి..అలిగి భూలోకానికి వచ్చేస్తుంది. ఆ రోజే ధనత్రయోదశి అని.. వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చే అమ్మవారిని ఇంటికి ఆహ్వానించేందుకు బంగారం కొనుగోలు చేస్తారని చెబుతారు
శ్రీ మహాలక్ష్మి భూలోకంలో అడుగుపెట్టిన మొదటి ప్రదేశం కొల్హాపూర్... అమ్మను అనుసరించిన కుబేరుడు ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల సంపదలకు అధిపతి అయ్యాడు.
అందుకే ధన త్రయోదశి రోజు శక్తిమేరకు బంగారం కొనుగోలు చేసి పూజలు చేస్తారు.