Winter Immunity Boosters : పిల్లలనుంచి పెద్దలవరకు రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఇవే
పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. దీనిని వంటల్లోనూ.. పాలల్లోనూ.. కషాయాల్లోనూ కలిపి తీసుకోవచ్చు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు లక్షణాలను తగ్గిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. అల్లం టీలలో, కూరల్లో చేసుకుని లాగించవచ్చు.
వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బరువు తగ్గడంలో, ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఇమ్యూనిటీని పుష్కలంగా పెంచుతాయి. వీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలబు, దగ్గు, ఫ్లూ లక్షణాలను దూరం చేస్తాయి.
పాలకూరలో విటమిన్ ఏ, సి, కె ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిని సలాడ్స్, స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు.
బాదంలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.
ఇవే కాకుండా యోగర్ట్, బెర్రీలను కూడా డైట్లో చేర్చుకోవచ్చు. ఇవి కూడా ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. సీజన్ మారేప్పుడు వీటిని రెగ్యూలర్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి.