Glow Up this Diwali : దీపావళి స్పెషల్ బ్యూటీ టిప్స్.. నిమిషాల్లో మెరిసే చర్మాన్ని అందించే ఫేస్ ప్యాక్‌లు
కుంకుమ పువ్వుతో ఇన్స్టాంట్ గ్లో తెప్పించుకోవచ్చు తెలుసా? కొన్ని కుంకుమ పువ్వులను పాలల్లో రాత్రి నానబెట్టాలి. ఉదయాన్నే దానిలో తేన కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీనిని పావు గంట ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగితే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపసుపుతో ఎన్నో స్కిన్ కేర్ ప్రయోజనాలు పొందవచ్చు. ఇది స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. శనగపిండిలో పసుపు, పెరుగు వేసి చిక్కని పేస్ట్‌గా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
రోజ్ వాటర్ స్కిన్ కేర్ రోటీన్లో ఉపయోగిస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది సహజమైన టోనర్‌గా పనిచేస్తుంది. రోజ్ వాటర్‌ను కాటన్ పాడ్‌ను ముంచి ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి. ఇది స్కిన్‌ని క్లియర్ చేసి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.
బాదం నూనెలో విటమిన్ ఈ ఉంటుంది. దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తాయి. చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కొంచెం బాదం నూనెను చేతుల్లో తీసుకుని.. దానిని ముఖంపై మసాజ్ చేసుకోవాలి. రాత్రుళ్లు నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఉదయాన్నే మంచి గ్లో వస్తుంది.
గంధం పొడిని ఎన్నో ఏళ్లుగా స్కిన్ కేర్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ పొడిలో రోజ్ వాటర్ వేసి పేస్ట్‌గా చేసి.. దానిని ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. అది ఆరేవరకు ఉంచి.. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మెరిసే, క్లియర్ స్కిన్‌ని ఇస్తుంది.
మీకు ఓపెన్ పోర్స్ ఉంటే ముల్తానీ మట్టి చాలా మంచిది. దీనిలో రోజ్ వాటర్ వేసి ఆ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. దానిని పావుగంట ఉంచి.. చల్లని నీటితో కడిగేయాలి. ఇది మీకు రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్‌లను పండుగ సమయంలోనే కాకుండా రెగ్యూలర్‌గా ఫాలో అయితే మీ స్కిన్ అందంగా, హైడ్రేటింగ్‌గా ఉంటుంది. మెరిసే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.