Brahmamudi Serial Today October 24th Highlights: కావ్య అంటే రాజ్ లో సగం కాదు రాజ్ కి డబుల్ - బ్రహ్మముడి అక్టోబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!
అనామికతో చేయికలిపిన మేనేజర్ ని ఉద్యోగం పీకేసి సెక్యూరిటీ గార్డుగా పెడుతుంది. ఎవరైనా మోసాలకు పాల్పడితే ఇలానే ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. ఆరు నెలలు సావాసం చేస్తే వారే వీరు అవుతారన్నట్టు మీరు కూడా రాజ్ సార్ లా మారిపోయారు అంటుంది శ్రుతి. ఇంకెప్పుడూ ఓవరాక్షన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది కావ్య..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅపర్ణ-ఇందిరాదేవి కూర్చుని రాజ్ ఆఫీసుకి వెళతాడో లేదో అని ఆలోచిస్తుంటారు. రుద్రాణి వచ్చి క్వశ్చన్ చేస్తే నిన్ను మీ ఆయన దగ్గరకు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నాం అంటారు. నేను చచ్చినా వెళ్లనంటూ సైలెంట్ గా కూర్చుంటుంది. ఇంతలో వచ్చిన రాజ్ వంటమనిషి శాంతను పిలిచి భారీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాడు..
కాల్ చేసిన కావ్య.. పాస్ వర్డ్ చెప్పమంటుంది. నేను చెప్పను దమ్ముంటే కనుక్కో అని సవాల్ చేసి కాల్ కట్ చేస్తాడు. తీసేసిన ఎంప్లాయ్ కంపెనీకి అన్నీ హ్యాండోవర్ చేయాలని కావ్య అన్నా కానీ..నేను చెప్పను అనేస్తాడు. అప్పుడు కావ్య రాజ్ తనని పిలిచే రకరకాల పేర్లు ట్రై చేస్తూ.. ఐ హేట్ కళావతి అని టైప్ చేయగానే ఓపెన్ అవుతుంది
మరోవైపు రైటర్ లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లిన కళ్యాణ్ ని అవమాం ఎదుర్కొని బాధతో తిరిగి వెళ్లిపోతాడు. నీ పదాలు నా దగ్గర చేరాకే వాటికి విలువ వచ్చిందని చెప్పి క్లాస్ వేస్తాడు..నీ రేంజ్ ఆటో నడుపుకోవడమే అని అవమానిస్తాడు
కిచెన్లోకి వెళ్లిన రాజ్.. తల్లి అపర్ణతో వంటల గురించి మాట్లాడుతాడు. పనీ పాటా లేకుండా కూర్చుంటే అలానే ఉంటుంది. వెళ్లి బాల్కనీలో కూర్చో వంటయ్యాక పిలుస్తాం అంటుంది. హాల్లోకి వచ్చిన తర్వాత ఇందిరాదేవి ఖడ్గ తిక్కన్న కథ చెప్పి సెటైర్స్ వేస్తుంది. పనిమనిషి శాంత నవ్వడం చూసి ఆవాలు ఇచ్చి లెక్కపెట్టమంటాడు
అయ్యగారు ఆఫీసుకి వెళ్లేవరకూ నేను పని మానేస్తాను అంటుంది శాంత. ఏం జరిగిందో తెలుసుకున్న అపర్ణ... వెళ్లి నేను చెప్పనట్టు చెప్పు అంటుంది. ఆవాల సంఖ్య చెప్పిన శాంతతో నిజమా అంటాడు రాజ్..అయితే మీరే లెక్కెంటుకోండి అనేసి డబ్బా చేతిలో పెట్టి వెళ్లిపోతుంది
బ్రహ్మముడి అక్టోబరు 25 ఎపిసోడ్ లో..కళావతి మార్చిన పాస్ వర్డ్ కనుక్కునే పనిలో పడ్డాడు రాజ్..