Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Diwali Date 2024: అనవసర రచ్చ , చర్చ వద్దు.. దీపావళి జరుపుకోవాల్సిన రోజు ఇదే!
తిథులు తగులు మిగులు వచ్చినప్పుడు..కొన్ని పండుగలకు సూర్యోదయం పరిగణలోకి తీసుకుంటే మరికొన్ని పండుగలకు సూర్యాస్తమయానికి ఉన్న తిథిని పరిగణలోకి తీసుకోవాలి.. దీపావళికి రెండో పద్ధతి అనుసరించాలి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీపావళి అమావాస్య అని పిలుస్తారు..అంటే అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు దీపావళి జరుపుకోవాలన్నమాట. ఈ లెక్కన అక్టోబరు 31 మధ్యాహ్నం నుంచి నవంబరు 1 సాయంత్రం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి..
అమావాస్య తిథి అక్టోబరు 31 గురువారం మధ్యాహ్నం 2 గంటల 46 నిముషాల నుంచి నవంబరు 1 శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ ఉంది. సాయంత్రానికి అమావాస్య ఘడియలు ఉన్న రోజు అక్టోబరు 31 గురువారం..అందుకే నిస్సందేహంగా దీపావళి వేడుకలు అక్టోబరు 31నే జరుపుకోవాలి
ధనత్రయోదశి, నరక చతుర్థశి, దీపావళి అమావాస్య వరుసగా మూడు రోజులు వస్తుంటాయి. తిథులు తగులు మిగులు ఉండడం సూర్యాస్తమయం, సూర్యోదయం లెక్కల కారణంగా.. ఈ ఏడాది ఈ మూడు పండుగలు రెండు రోజుల్లో వచ్చేస్తున్నాయి
అక్టోబరు 30 బుధవారం ధన త్రయోదశి కాగా.. అక్టోబరు 31 గురువారం నరకచతుర్థశి, దీపావళి రెండూ వచ్చాయి...
దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజ చేయడం ద్వారా ఇంట్లో సరిసంపదలు వెల్లివిరుస్తాయంటారు. ఇంట్లో ఈశాన్యం లేదా ఉత్తర దిశగా ప్రదేశాన్ని శుభ్రంచేసి పీటపై ఎర్రటి వస్త్రం పరిచి ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత లక్ష్మీ పూజ చేయాలి.
మహాలక్ష్మికి తియ్యటి పదార్థాలు నివేదించి.. పూజ అనంతరం ప్రసాదం అందరకీ నివేదించి.. ఇల్లంతా దీపాలు వెలిగించాలి