Batukamma 2025: చిరుజల్లుల్లోనూ మహిళల ఉత్సాహం.. భాగ్యనగర వీధుల్లో కన్నులపండువగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!
సెప్టెంబర్ 21 ఆదివారం పితృఅమావాస్య నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన తర్వాత ఈ పండుగ మొదలవుతుంది
ఈ పండుగ ప్రకృతి, మహిళల సంతోషం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం, అంటే జీవితాన్ని ప్రోత్సహించే దేవత అని అర్థం
మొత్తం 9 రోజుల పాటూ సాగే బతుకమ్మ పండుగలో మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. రంగురంగుల పూలను బతుకమ్మగా పేర్చి మధ్యలో గౌరవమ్మను ఉంచి మహిళలంతా ఆడిపాడతారు
తంగేడు, గుమ్మడి, గునుగు పూలతో ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేస్తారు
పూలను గోపురంలా పేర్చి తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మను సిద్ధంచేసి..ఇంట్లో దేవుడి మందిరంలో పూజ చేసి నైవేద్యం సమర్పించి అనంతరం ఇంటి లోగిలిలో ఉంచి ఆడిపాడతారు
భాగ్యనగర వీధులన్నీ బతుకమ్మ సంబురాలతో కళకళలాడుతున్నాయ్..
బతుకమ్మలన్నింటినీ ఓ చోట చేర్చి ఆటపాటల తర్వాత నిమజ్జనం చేస్తారు
మొదటి రోజు పూలను నీటిలో నిమజ్జనం చేసి గౌరమ్మను తీసుకొచ్చి ముత్తైదువులకు అందిస్తారు..చివరి రోజు సద్దులబతుకమ్మ రోజు గౌరమ్మను కూడా నిమజ్జనం చేస్తారు
పితృదేవతలను తలుచుకుంటూ అన్నదానం చేసిన తర్వాత బతుకమ్మ పేర్చుతారు..అందుకే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు
ముందు ఎవరి ఇంటి ముందు వారు తయారు చేసిన బతుకమ్మతో ఆడిపాడి..ఆ తర్వాత అన్నింటినీ ఓచోట చేర్చి మహిళలంతా కలసి పాటలు పాడతారు
ఈ రోజు పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పించి..అందరకీ పంచిపెడతారు
9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి