Pawan Kalyan - OG Concert Photos: 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోలు - కటానాతో మామూలు హంగామా చేయలేదుగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఓజీ'. ఎల్బీ స్టేడియంలో ఆదివారం రాత్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ ఫోటోలు చూడండి.
వర్షం పడినా సరే అభిమానులు ఎల్బీ స్టేడియం నుంచి కదల్లేదు. పవన్ కళ్యాణ్ సైతం వర్షంలో అరగంటకు పైగా స్టేజి మీద ఉండి అందరినీ ఎంటర్టైన్ చేశారు.
'ఓజీ' సినిమాలో కటానాతో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్సులు చేశారు. స్టేజిపైకి ఆ కటానాతో వచ్చారు.
'ఓజీ' సినిమాలో పోషించిన గెటప్ తో పవన్ కళ్యాణ్ స్టేజి మీదకు వచ్చారు. సుజీత్ చేసిన పని వల్ల సినిమాలో గెటప్ తో రావాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
దర్శకుడు సుజీత్ తో పవన్ కళ్యాణ్. సుజీత్ టీం అంతా యంగ్ అని, తాను డైరెక్ట్ చేసే టైంలో ఇటువంటి టీం దొరికితే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని కాదేమో అని పవన్ పేర్కొన్నారు.
'ఓజీ' సినిమా సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్... ఇద్దరినీ స్టేజిపై చూడొచ్చు.