AP, Telangana Union Ministers: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా!
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మొదటగా నరేంద్ర మోదీతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం మిగతా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ముర్ము. ఈ వేడుక వైభవంగా నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి హిందీ భాషలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇంగ్లీషు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము టీడీపీ ఎంపీ పెమ్మసానితో కేంద్రమంత్రిగా ప్రమాణం చేయించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేశాక ప్రధాని మోదీ వద్దకు వెళ్లగా.. ఆయన బండి సంజయ్ భుజం తట్టారు.
బీజేపీ నేత, నరసాపురం ఎంపీగా గెలిచిన శ్రీనివాస్ వర్మ సైతం హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు.
Narendra Modi Cabinet Group Photo: ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్ర మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను కేంద్ర మంత్రి అమిత్ షా షేర్ చేశారు.