NDA Meeting: మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఎన్డీఏ నేతలు ఢిల్లీకి చేరుకుని సమావేశం అయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలతో కీలకంగా భేటీ అయ్యారు. గతంలోలాగ సొంత మెజార్టీ రానందున కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు డిమాండ్ పెరిగింది.
ఎన్డీయే కూటమి సమావేశంలో ప్రధాని మోదీ పక్క సీట్లో చంద్రబాబు కూర్చుకున్నారు. ఆయన పక్కనే నితీష్ కుమార్ ఉన్నారు.
కూటమి నేతలు నరేంద్ర మోదీని ఎన్డీయే పక్షనేతగా నిర్ణయించారు. మోదీని తమ అధినేతగా, ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడంతో కూటమి నేతలు అందుకు మద్దతు తెలిపారు
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కూటమి భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్ తమ లేఖలు అందజేశారు.
ప్రధాని మోదీ నివాసంలో చంద్రబాబు, నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు నాయుడు