Lok Sabha Elections 2024: ఏడో విడత పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ బూత్‌లో ఓటు వేసిన తొలి ఓటర్ ఆయనే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు యోగి. రామ మందిర నిర్మాణం గురించి ప్రచారంలో చాలా సార్లు ప్రస్తావించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతటా మోదీ వేవ్ కనిపిస్తోందని తప్పకుండా తనను ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకముందని చెప్పారు. 400 సీట్ల లక్ష్యాన్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కంగనా.
మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్‌లోని జలంధర్‌లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఓటర్లకు సూచించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. హమీర్పూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అనురాగ్ ఠాకూర్. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు బూత్‌లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని బక్తియర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నాలో ఓటు వేశారు. లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రి దేవి, కూతురు సరన్ లోక్‌సభ అభ్యర్థి రోహిణి ఆచార్య ఈ విడతలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గంలోని లఖ్‌నౌర్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేసే ప్రతి ఓటు దేశానికి మార్గనిర్దేశం చేస్తుందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలు పంచుకోవాలని కోరారు. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.