Keir Starmer: బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్, ఆలయానికి ఎందుకు వెళ్ళారంటే
లండన్‌లో లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిన తరువాత కీర్ స్టార్మర్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్-3ని కలిశారు. రాజు ఛార్లెస్-3 ఆమోదంతో ప్రధాని ఎన్నిక పూర్తి అయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలాంఛనాలు పూర్తి కాగానే 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రజలనుద్దేశించి స్టార్మర్ మాట్లాడారు. తమది సేవా ప్రభుత్వం అని.. దేశానికి మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో అవకాశాల మౌలిక సదుపాయాలను పునర్నిర్మిస్తామన్నారు.
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ప్రచారంలో భాగంగా హిందూ ఓటర్లపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. అప్పుడే లేబర్ పార్టీ నేతగా ఉన్న కీర్ స్టార్మర్డ కింగ్స్‌బరీలో ఉన్న స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు.
ఇక శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో లేబర్ పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్లకే పరిమితం అయ్యింది.
భారత్‌తో తాము వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూనే ఉంటామనీ , హిందూ ఆలయాల రక్షణ, ఈ వర్గంపై దాడులను దీటుగా ఎదుర్కొనే చర్యలు తమ మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు.