Dubai Floods: నీట మునిగిన మాల్స్, విమానాశ్రయాలు- ఎడారిలో వరద బీభత్సం- దుబాయ్‌లో పరిస్థితి చూస్తే షాక్ అవుతారు
దుబాయ్‌లో కుండపోత వర్షాలకు నీట మునిగిన విమానాశ్రయం, మాల్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా పేరు ఉన్న దుబాయ్‌లో వర్షాలు కుమ్మేశాయి. వరదలు ముంచెత్తాయి. గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయి.
యూఏఈలో ప్రముఖ నగరాల్లో ఒకటి, ప్రపంచ ధనిక నగరంగా పేరున్న దుబాయ్‌లో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం కురిసిన వర్షాలకు రోడ్లు, విమానాశ్రయాలు, మాల్స్ పూర్తిగా నీట మునిగాయి.
గల్ఫ్‌లో కొన్ని రోజులుగా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఫలితంగానే దుబాయ్‌ను వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చెరువును తలపించేలా నీరు చేరింది. విమాన సర్వీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. గంటల పాటు విమానాలు ల్యాండ్ కాలేదు. టేకాఫ్ కూడా కాలేదు. పదుల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు.
మిడిల్ ఈస్ట్‌లో ఆర్థికంగా మంచి పేరున్న నగరం దుబాయి. అలాంటి నగరంలో వరదలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. విమానశ్రయంతోపాటు మాల్స్, ఇళ్లు అన్నీ నీట మునిగాయి. దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లోకి వరద నీరు చేరి చెరువులా మారింది.
ఎడారి ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన గల్ఫ్‌లో చాలా అరుదుగా వర్షాలు కురుస్తుంటాయి. తుపానుల టైంలో కుండపోత వర్షాలు కురుస్తాయి. అందుకే అక్కడ నిర్మాణాలు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా వరదలు వచ్చేసరికి ఇలా ఇళ్లు, షాపింగ్ మాల్స్ నీట మునిగాయి.
వర్షాలు కారణంగా స్కూల్స్‌కి సెలవులు ఇచ్చారు. 24 గంటల్లో 80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
సాధారణ పరిస్థితుల్లో దుబాయ్‌లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. వర్షం పడేది చాలా తక్కువ. అందుకే ఒకేసారి కుండపోత వర్షం పడటంతో జనం కకావికలమైపోయారు.