Abu Dhabi's BAPS Mandir: అబుదాబి స్వామినారాయణ్ మందిరంలో రికార్డ్ స్థాయిలో దర్శనాలు
అబుదాబి ఆలయంలో రికార్డ్ స్థాయిలో దర్శనాలు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅబుదాబిలోని మొదటి హిందూ దేవాలయం రికార్డు సృష్టించింది. మార్చి 3 ఆదివారం ఒక్కరోజే 65 వేలమంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 40 వేల మంది, సాయంత్రం 25 వేల మంది భక్తులు పూజలు చేశారు.
మార్చి 1 నుంచి ఈ ఆలయంలో భక్తులను దర్శనాలకు అనుమతించడం ప్రారంభించారు. మొదటి రోజు నుంచీ భక్తుల రద్దీ కొనసాగుతోంది..
ఇంత రష్ లో ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమని భావించిన భక్తులు..అద్భుతంగా దర్శించుకున్నామని BAPS వాలంటీర్స్ కి హ్యాట్సాఫ్ అని చెప్పుకొచ్చారు
దశాబ్ధాలుగా దుబాయ్ లో నివసిస్తున్న తమకు ఇప్పటివరకూ ప్రార్థనలు చేసేందుకు మంచి స్థలం లేదు..ఈ మందిరంతో ఆ లోటు తీరిందన్నారు మరికొందరు భక్తులు
BAPS సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఈ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్ కి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులు వేసుకునేవారు ఆలయంలోకి అడుగుపెట్టేందుకు అనుమతి లేదు అనుమతి
అబుదాబి దేవాలయంలో రికార్డ్ స్థాయిలో దర్శనాల