Ashika Ranganath Photos: ఆహా ఆషికా... అంత ముద్దొస్తుంటే చూడకుండా ఎవరుంటారు?
నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ అమ్మాయి ఆషికా రంగనాథ్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఆషికా అందానికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'ఎన్నో రాత్రులు వస్తాయి గానీ...' రీమిక్స్ పాటలో ఆమె గ్లామర్ హైలైట్ అయింది. తర్వాత కింగ్ అక్కినేని నాగార్జునకు జోడీగా 'నా సామి రంగ' సినిమాలో ఆషికా రంగనాథ్ నటించారు. ఆ సినిమా సక్సెస్ అందించింది. ఇప్పుడీ అందాల భామ దుబాయ్ లో ఉన్నారు.
దుబాయ్ దేశంలో జరిగిన గామా అవార్డ్స్ 2024కి ఆషికా రంగనాథ్ అటెండ్ అయ్యారు. రెడ్ కార్పెట్ మీద సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి.
'అమిగోస్', 'నా సామి రంగ' జయాపజయాలతో సంబంధం లేకుండా ఆషికా రంగనాథ్ అందం యువతను ఆకట్టుకుంది. ఆమెకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆషికా రంగనాథ్ అంటే ఆడియన్స్ లో క్రేజ్ ఉండటంతో దర్శక నిర్మాతలు, హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
త్వరలో ఆషికా రంగనాథ్ కొత్త సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఆషికా రంగనాథ్ ఫోటోలు
ఆషికా రంగనాథ్ ఫోటోలు