Sirisha Bandla: మీరు ఊహించని ప్లేసెస్‌లో స్పేస్గాల్ శిరీష హాలిడే టూర్
శిరీష బండ్ల.. అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి తెలుగమ్మాయి. గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీషకు ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అమెరికాలో స్థిరపడినప్పటికీ ఆమె తెలుగు సంప్రదాయాలను మర్చిపోలేదు. గోంగూర పచ్చడి, చేపల పులుసు అంటే ఆమెకు చాలా ఇష్టం. తెలుగు చక్కగా మాట్లాడగలరు. 2016లో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా శిరీష తెనాలి వచ్చారు. ఆ సమయంలో ఆమె హంసలదీవి, శ్రీశైలం వంటి ప్రదేశాలను సందర్శించారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. జంతువులంటే చాలా ఇష్టం. ఆమెకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలు మీకోసం.. (Source: sirishabandla Instagram Page)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశిరీషకు మూడేళ్లు వచ్చే వరకు చీరాలలోనే ఉన్నారు. ఊహ తెలిసిన నాటి నుంచే ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి కనపరిచేవారు. అమ్మా, నాన్న, అక్కలతో శిరీష చిన్ననాటి ఫొటో
శిరీష బంధాలు, బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. వీలు దొరికినప్పుడల్లా చుట్టాలతో మాట్లాడుతుంటారు. ఇక కజిన్స్ అంతా ఒక చోట కలిస్తే రచ్చరచ్చ చేస్తారు. చిరునవ్వులు చిందిస్తున్న బుల్లి శిరీష (నీలం రంగు డ్రస్)ను ఇక్కడ చూడవచ్చు
ఏ అమ్మాయికైనా నాన్నే మొదటి హీరో. శిరీషకు కూడా అంతే. తన ప్రపంచంలో నాన్నే ఫస్ట్ హీరో అని కితాబిచ్చింది. శిరీష కుటుంబంతో కలిసి దిగిన ఫొటో
కుటుంబంతో కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్లినప్పుడు తీసిన ఫొటో. ఇందులో శిరీష తండ్రి, అక్కలను చూడవచ్చు.
శిరీష అమెరికాలో ఉన్న కూడా మన సంప్రదాయాలను మర్చిపోలేదు. పండుగలు, ఫంక్షన్లు వంటివి ఉన్నప్పుడు ఇలా చక్కగా రెడీ అవుతారు.
కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద కారుపై విహరిస్తుండగా క్లిక్ మనిపించిన ఫొటో..
2016లో తెనాలి వచ్చినప్పుడు తన కజిన్స్‌తో కలిసి సరదాగా దిగిన ఫొటో..
2016లో తెనాలి వచ్చినప్పుడు ఆమె శ్రీశైలం, నల్లమల్ల అడవులను సందర్శించారు. ఆ సమయంలో ఇలా బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు తీసిన ఫొటో..
శిరీషకు జంతువులంటే చాలా ఇష్టం. 2017లో ఆమె దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగారాన్ని సందర్శించినప్పుడు రూ (ROO) అనే కంగారూతో ముచ్చటిస్తున్న చిత్రం..
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంటే శిరీషకు చాలా ఇష్టం. హాకింగ్ మరణించినప్పుడు ఆయనను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన అంతరిక్షం గురించి చెప్పిన మాటలను కూడా పంచుకున్నారు.
శిరీషకు ప్రకృతి అన్నా, సాహసాలన్నా చాలా ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అలా వెళ్లినప్పుడు తీసిన ఫొటో..
శిరీషకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఆమె పెంపుడు పిల్లి పేరు కుట్టి. ఖాళీ సమయాల్లో కుట్టీతో గడిపేందుకు ఆసక్తి చూపుతారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అలా తీసిన ఫొటోలలో ఇది కూడా ఒకటి.
కాబోయే భర్త సీన్ హూతో కలిసి సరదాగా బౌలింగ్ చేస్తున్న శిరీష..
సీన్ హూతో కలిసి విస్ప్ రిసార్ట్‌లో సరదాగా విహరిస్తూ దిగిన ఫొటో..