National Lazy Day 2021: బద్ధకం చాలా మంచిదే.. బద్ధకస్తుల దినోత్సవం రోజు చేయాల్సిన పనులు ఇవే
మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబసభ్యులతో ఎంచక్కా టీవీ చూడండి. మీకు నచ్చిన సినిమాలు లేదా హాస్యాన్ని పంచే సినిమాలు, వినోద కార్యక్రమాలు చూస్తే బెటర్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపని ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈరోజు ప్రశాంతంగా.. వీలైనన్ని గంటలు నిద్రపోండి. దీనివల్ల కొన్ని రోజుల వరకు మీ పనితీరు మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆధునిక జీవనశైలిలో భాగమైన స్మార్ట్‌ఫోన్‌కు కనీసం ఈ ఒక్కరోజైనా దూరంగా ఉండాలి. పదే పదే నోటిఫికేషన్లు, మెస్సేజ్‌లు చూస్తూ ఇబ్బంది పడేందుకు బదులుగా ఇంటర్నెట్ను ఆఫ్ చేసి ప్రశాంతంగా కూర్చోండి.
ముఖ్యంగా నగదు, ఆర్థిక సంబంధిత సమస్యల గురించి ఆలోచన వదిలేసి మీకు ఇష్టమైన వారికి సమయాన్ని కేటాయించండి. తద్వారా మీ సంతోషం రెట్టింపవుతుంది. బద్ధకస్తులపై అందరూ చాడీలు చెప్పడం ఫిర్యాదులు చేయడం చేస్తుంటారు. కానీ ఏదైనా పనిని తేలికగా ఎలా చేయాలో అందరికంటే ఎక్కువగా ఆలోచించేది బద్ధకస్తులేనని పలు అధ్యయనాలలో తేలింది.