Lok Sabha Elections 4th Phase: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు, ప్రశాంతంగా పోలింగ్
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సీమా యాదవ్ ఓటు వేశారు. 100% పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటు తప్పకుండా వేయాలని సూచించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఝార్ఖండ్‌లోని కుంతీ నియోజకవర్గంలో అర్జున్ ముండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలపై కేవలం రాజకీయ పార్టీలకే కాకుండా ఓటర్లందరికీ ఆసక్తి నెలకొందని వెల్లడించారు. దేశ ప్రజలంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారన్న నమ్మకముందని అన్నారు. ఝార్ఖండ్‌లో అత్యంత కీలక నేతల్లో ఒకరైన అర్జున్ ముండా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్ షాజనాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ ప్రధాని మోదీనే మరోసారి ఎన్నుకుంటారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంతో పోల్చి చూస్తే ఈ సారి ఓటు శాతం పెరుగుతుందని అన్నారు. బీజేపీకి అనూహ్య రీతిలో మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి, మహారాష్ట్రలోని జల్నా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రావుసాహెబ్ పాటిల్ దన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జల్నాలోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. తన గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 8 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించానని గుర్తు చేశారు. బీజేపీ కచ్చితంగా 400కి పైగా సీట్లు సాధిస్తుందని తేల్చి చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లో JKNC చీఫ్ ఫరూక్ అబ్దుల్లాతో పాటు ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో ఓటు వేశారు. ఆర్టికల్ 370 రద్దు తరవాత ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఒమర్ అబ్దుల్లా తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బిహార్‌లోని బేగుసరై నియోయజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్యా కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కన్హయ్య బేగుసరైలో ఓటు వేశారు. ఇక్కడ సిట్టింగ్ బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్, సీపీఐ అభ్యర్థి అవదేశ్ రాయ్ మధ్య పోటీ నెలకొంది.
లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇండోర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలని సూచించారు. దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వాళ్ల కోసం ఓటు వేయడం మనందరి బాధ్యత అని వెల్లడించారు.