In Pics: శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఎగురుతున్న జాతీయ జెండా - ఏంటి దీని ప్రత్యేకత?
భారతదేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు లాల్ చౌక్ అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకశ్మీర్ అప్పటి మహారాజు హరి సింగ్‌తో పోరాడినందున రష్యన్ విప్లవం నుంచి ప్రేరణ పొందిన వామపక్ష కార్యకర్తలు ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు.
1920లలో లాల్ చౌక్ స్థానిక రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది.
భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖ నాయకులు ఈ ప్రాంతంలో ప్రసంగించారు.
1947 - 1948 నాటి ఇండియా - పాకిస్తాన్ యుద్ధం తరువాత, నెహ్రూ లాల్ చౌక్‌లో నిలబడి కశ్మీరీ ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ రాజకీయ భవిష్యత్తును ఎంచుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
1946లో షేక్ అబ్దుల్లా నేతృత్వంలో 'క్విట్ కాశ్మీర్' ఉద్యమం లాల్ చౌక్ నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యమం డోగ్రా పాలనను వ్యతిరేకిస్తూ, కాశ్మీరీ ప్రజల స్వాతంత్ర్య హక్కుల కోసం సాగింది.
1992లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు లాల్ చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత, కాశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయింది. ఈ పరిణామం తర్వాత లాల్ చౌక్ ప్రాంతం అనేక మార్పులను చవి చూసింది.
ప్రస్తుతం లాల్ చౌక్ కాశ్మీర్ లోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా అభివృద్ది చెందిన ఒక ప్రాంతం. 2024లో లాల్ చౌక్ క్లాక్ టవర్ పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ లాల్ చౌక్ భారత త్రివర్ణ పతాక లైటింగ్ తో ప్రజలను ఆకర్షిస్తోంది.