Krishnastami Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - సుందరంగా ముస్తాబైన కన్నయ్య ఆలయాలు, కశ్మీర్‌లో భద్రత మధ్య సంబరాలు
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కన్నయ్య ఆలయాలను సుందరంగా అలంకరించారు. ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్‌లోని జుగల్ కిషోర్ జీ ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు.
గుజరాత్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
ఇస్కాన్ టెంపుల్‌లో ప్రత్యేక అలంకరణలో రాధాకృష్ణులు. గుజరాత్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో భక్తులు సందడి చేశారు. కృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు.
అటు, జమ్మూకశ్మీర్‌లోనూ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. లాల్ చౌక్ వద్ద వీధుల్లో డ్యాన్సులు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.
శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన పాటలతో కృష్ణుని కీర్తించారు.
శ్రీనగర్‌లోని శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణతో అలరించారు.
వేడుకలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.
ఊరేగింపు సందర్భంగా యువకులు, చిన్నా పెద్దా అంతా కలిసి డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు.
అటు, శ్రీనగర్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని బిర్లా ఆలయంలో నెమలి ఈకలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మధుర, బృందావనంల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.