Ram Mandir: అయోధ్య రామమందిరానికి లీకేజీల బెడద- ఆలయ ప్రధాన పూజారి వెల్లడి సంచలన కామెంట్స్
అయోధ్య రామమందిరంలోని గర్భగుడి నుంచి వర్షపు నీరు పడుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయోధ్యలో కొత్తగా నిర్మించిన శ్రీరామ మందిర గురించి ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ కీలక విషయాలు వెల్లడించారు. భారీ వర్షం పడిన తర్వాత పైకప్పు నుంచి నీరు కారిందని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది జనవరి 22 ప్రారంభమైన అయోధ్య రామాలయ నిర్మాణ పనుల్లో లోపాలు ఉన్నట్టు సత్యేంద్రదాస్ వెల్లడించారు.
భారీ వర్షం పడిన తర్వాత రామాలయంలోని గర్భగుడిలో పై కప్పు నుంచ వర్షపు నీరు పడుతున్నట్టు 24 జూన్, 2024న సత్యేంద్ర దాస్ గుర్తించారు.
గర్భగుడికి ముందు వీఐపీలు వచ్చే ప్రదేశం దర్శన మందిరం వర్షపు నీటితో నిండిపోయిందని సత్యేంద్రదాస్ వివరించారు.
ఇలా వర్షపు నీరు పడటం గతంలో ఎప్పుడూ చూడలేదని తొలిసారి సోమవారం గమనించినట్టు వెల్లడించారు.
ఉదయం పూజకు వెళ్లినప్పుడు నీళ్లు కనిపించాయని సత్యేంద్ర దాస్ వివరించారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామాలయంలో ఇలా వాటరి లీకేజీలు చూసిన అధికారులు హుటాహుటిన చర్యలకు సిద్ధమయ్యారు.
జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.