గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో బాధితులను పరామర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మోర్బీ వంతెన కూలిన ఘటనలో గాయపడిన బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రమాదానికి కారణాలపై ప్రతి అంశాన్ని పరిశోధించాలని, కుటుంబాలకు పూర్తి సాయం అందించాలని అన్నారు.
మోర్బిలోని సివిల్ ఆసుపత్రిలో గాయపడిన వారిని మోదీ పరామర్శించారు,
ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలపై ఆరా తీశారు.
అనంతరం ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు
గుజరాత్ బ్రిడ్జి కూలిన ఘటనను ప్రధాని మోదీ మంగళవారం మోర్బీని సందర్శించారు.
రెస్క్యూ, రిలీఫ్ వర్క్‌లో నిమగ్నమైన వారితో కూడా ప్రధాని సంభాషించారు. వారి సహనాన్ని ప్రశంసించారు.
మోర్బిలో తీగల వంతెన కుప్పకూలిన ఘటనలో 135 మంది మరణించారు.
అధికారులు బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉండాలని మోదీ సూచించారు
ఈ విషాద సమయంలో వారికి సాధ్యమైనంత సహాయం అందేలా చూడాలని ప్రధానమంత్రి చెప్పారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను గుర్తించే సమగ్ర దర్యాప్తును నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ