In Pics: ఎయిర్ ఫోర్స్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి ఇండియన్స్, ‘ఆపరేషన్ గంగ’ ఫోటోలు చూసేయండి
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తరలిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) పేరుతో గత శుక్రవారం (ఫిబ్రవరి 25) ఈ డ్రైవ్ ప్రారంభం అయింది.
ఈ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 3,352 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో 208 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు.
కేంద్ర మంత్రులు కూడా వీరి తరలింపు వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నేడు హంగేరి, రొమేనియా, స్లోవేకియా, పోలెండ్ నుంచి మొత్తం 9 విమానాలు భారత్ చేరుకుంటున్నట్లు విదేశాంగమంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు.
మరో 6 విమానాలు త్వరలో రానున్నట్లు తెలిపారు.
ఇప్పటిదాకా భారత్‌కు మూడున్నవేలకు పైగా భారతీయులను వెనక్కి తీసుకొచ్చామని వివరించారు.
మరోవైపు, ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయులకు దుప్పట్లు, ఆహార వస్తువులను కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ (Vijay Kumar Singh) భారతీయుల తరలింపులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
పోలాండ్ (Poland) నుంచి భారతీయులను తరలిస్తుండగా వారితో కలిసి ప్రత్యక్షంగా ఉండి సాయం అందించారు.
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన వారికి ఘన స్వాగతం లభిస్తోంది.