IND vs SL Test series: విరాట్, వందో టెస్టులోనైనా వందేస్తాడా! కరవు తీరుస్తాడా!
శ్రీలంకతో తొలి టెస్టుకు టీమ్ఇండియా రెడీ అవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళవారం ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
మార్చి 4 నుంచి 8 వరకు మొహాలి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
విరాట్ కోహ్లీకి ఇది వందో టెస్టు మ్యాచు.
అభిమానులు లేకుండా కోహ్లీ వందో మ్యాచ్ ఆడుతున్నాడు.
రెండున్నరేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయలేదు. ఇందులోనైనా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ మ్యాచులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు.
రహానె, పుజారా స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ ఆడనున్నారు.
విరాట్ ఎప్పట్లాగే తన నాలుగో స్థానంలో ఆడతాడు.
శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉండటంతో హనుమ విహారికి చోటు దక్కడం లేదు.
ప్రాక్టీస్ సెషన్లో కుల్దీప్, బుమ్రా, అశ్విన్, విరాట్, సిరాజ్ ఉత్సాహంగా కనిపించారు.
రిషభ్ పంత్ ను రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు. All image credit: BCCI