In Pics: దాల్ సరస్సులో బోటింగ్ స్పెషాలిటీ ఏంటి? ఈ లేక్‌లో షికారుకు ఎంత ఛార్జ్ చేస్తారు?
శ్రీనగర్ లోని దాల్ లేక్ లో షిఖారా (Dal lake Shikhara) చెయ్యడం ఒక మరుపు రాని అనుభూతిగా నిలుస్తుందనడంలో ఏటువంటి అతిశయోక్తి లేదు. దాల్ లేక్ ను శ్రీనగర్ జ్యువెల్ అని కూడా చెబుతారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంవత్సరంలో సుమారు 8 నెలల పాటు ఇక్కడ బోటింగ్ చేసేందుకు వీలుగా బోటు డ్రైవర్లు టూరిస్ట్ లను షిఖారా యాత్రకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.
దాల్ లేక్ చుట్టూ ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణి అందాలు (Zabarwan Range) టూరిస్ట్ లకు మరుపు రాని జ్ఞాపకాలను అందిస్తుంది.
దాల్ సరస్సుపై నిర్మించిన బోట్ హౌసెస్ చూస్తే, చుట్టూ ఉన్న అందాలను వీక్షించవచ్చు.
దాల్ సరస్సు పరిసరాల్లో షికారు చెయ్యాలంటే ఒక్క గంటకు రూ.1600 నుంచి రూ.1800 ఛార్జ్ చేస్తారు.
దాల్ లేక్ చుట్టూ చిరు వ్యాపారులు టూరిస్ట్ లకు కావల్సిన తిను బండారాలు అందుబాటులో ఉంచుతారు. గ్రిల్డ్ పనీర్, చికెన్, ఫ్రూట్స్, ఖావా, టీ వంటివి అందుబాటులో ఉంటాయి.
దాల్ లేక్ లో ఫ్లోటింగ్ హౌస్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక్క రాత్రి గడపాలంటే సుమారు 1600 నుంచి 3000 ఛార్జ్ చేస్తారు.
దాల్ లేక్ ను ఫ్లవర్స్ లేక్ అనీ.. శ్రీనగర్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు.
ఈ సరస్సు తీర రేఖ, దాదాపు 15.5 కిలోమీటర్ల దాకా ఉంటుంది.
చలికాలంలో ఈ దాల్ లేక్ ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్ 11 డిగ్రీలకు కూడా చేరుకుంటుంది. అప్పుడు ఈ సరస్సు మొత్తం గడ్డకడుతుంది.
దాల్ సరస్సు శ్రీనగర్ నగర పరిధిలోనే ఉంది. దీనిని రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
సరస్సుకు 12.8 కిలోమీటర్ల దూరంలో బద్గామ్ విమానాశ్రయం, 18.8 కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఉంది.
దాల్ సరస్సులో పడవ ప్రయాణం
దాల్ సరస్సు అందాలు