Budget 2024 Updates: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి తీసుకున్న ఆర్థిక మంత్రి- పెరుగు, పంచదార తినిపించిన ముర్ము
2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఇవాళ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయం 9 గంటలకే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్ అక్కడ అధికారులతో సమావేశమయ్యారు.
బడ్జెట్‌కు సంబంధించిన తుది ప్రక్రియను పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ అనంతరం రాష్ట్రపతితో సమావేశమయ్యారు.
ఆర్థిక మంత్రిత్వశాఖకు వెళ్లే ముందు బడ్జెట్ ఉన్న పౌచ్‌ను మిడియాకు చూపించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. 2024-25 బడ్జెట్ డిజిటల్ కాపీని ముర్ముకు అందజేశారు.
సంప్రదాయబద్దంగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి ముర్ము పెరుగు, పంచదార తినిపించారు.
పార్లమెంట్లో బడ్జెట్ 2024-25 ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ముర్ము నుంచి ఆర్థిక మంత్రి ఆమోదం తీసుకున్నారు.
2019 నుంచి వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ఒక మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది.