Mukesh Ambani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఆప్యాయంగా పలకరించిన ముకేష్ అంబానీ, Photos చూశారా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో శనివారం జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ముకేష్ అంబానీ స్వాగతం పలికారు. కాసేపు వారితో ఆప్యాయంగా ముచ్చటించారు రిలయన్స్ అధినేత.
జులై 12న అనంత్, రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరగగా, శనివారం నాడు వధూవరులను ఆశీర్వదించే శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహించారు.
అంబానీల ఈవెంట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. తన సతీమణి ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ అధినేతలను ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబుతో ప్రముఖ నేతలు కాసేపు ముచ్చటించారు. ఏపీ సీఎం అయినందుకు అభినందనలు తెలిపారు. రాజకీయ నేతలు ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.