Delhi Rains: భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్- ఒకరు మృతి పలువురికి గాయాలు
భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. ఇన్నాళ్లు ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఘోర ప్రమాదం జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు విమానాశ్రయంలోని టెర్మినల్-1 దెబ్బతింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.
వర్షాలు ఇటు ప్రమాదంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి సంస్థలు తమ పలు విమానాలను రద్దు చేసుకున్నాయి.
భారీ వర్షాలకు ఇందిరాగాంధీ టెర్మినల్ 1 పైకప్పు కూలింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి టెర్మినల్ 1 పైకప్పు అకస్మాత్తుగా ఊడి పడింది. అక్కడ ఉన్న మనుషులకు గాయాలు అయ్యాయి. కార్లు ధ్వంసం అయ్యాయి.
ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసన వెంటనే రెస్క్యూ టీం అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. సమాచారం మేరకు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.