Aero India 2023 Photos: ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియాలో కళ్లు చెదిరే విన్యాసాలు
ఏరో ఇండియా–2023 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. (Photo Source AP)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appద్వైవార్షిక ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 'ఏరో ఇండియా' 14వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో సోమవారం ప్రారంభించారు. (Photo Source: AP)
బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవం సందర్భంగా భారత ఎయిర్ ఫోర్స్ చెందిన విమానాలు విన్యాసాలు (Photo Source: AP)
ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) ప్రదర్శన (Photo Source: AP)
భారత వైమానిక దళం (IAF) సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం విన్యాసాలు (Photo Source: AP)
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్లు, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు మరియు సుఖోయ్-30, అలాగే ధృవ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను ప్రదర్శించింది. (Photo Source: AP)
IAF సూర్య కిరణ్ బ్యాచ్ అద్భుతమైన ప్రదర్శనతో ఈవెంట్‌ను విజయవంతం చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న పైలట్లలో తొమ్మిది మంది పైలట్లు డైమండ్ డిస్ప్లే చేశారు (Photo Source: AP)
భారతదేశం ఇకనుంచి ప్రపంచంలోని డిఫెన్స్ కంపెనీలకు మార్కెట్ మాత్రమే కాదు, రక్షణ రంగంలో వారికి భాగస్వామిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. (Photo Source: AP)
ఐదు రోజుల ఏరోస్పేస్, డిఫెన్స్ ఎక్స్పో లో యుద్ధ విమానాలు చాలా ఎత్తుకు ఎగురుతూ అద్భుతమైన విన్యాసాలు చేశాయి. (Photo Source: AP)
21వ శతాబ్దంలో సరికొత్త భారత్ ఏ అవకాశాన్ని వదులుకోదని, సంస్కరణలతో ప్రతి రంగంలో విప్లవాన్ని తీసుకువస్తున్నాం అన్నారు ప్రధాని మోదీ. (Photo Source: AP)
బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనే దేశాల జెండాలు (Photo Source: AP)
ఏరో ఇండియా తొలి రోజున భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ విమానం విన్యాసాలను చేసింది. (Photo Source: AP)