INS Vikrant: భారత చరిత్రలో సువర్ణాధ్యాయం, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైన ఘనత
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మరో అరుదైన ఘనతను సాధించాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాన్ని యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై భారత నేవీ విజయవంతంగా ల్యాండ్ చేసింది. తద్వారా భారత్ తమ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.
భారత్ స్వదేశీ యుద్ధ విమానాలు డిజైన్ చేయడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో తయారు చేసి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన యుద్ధ నౌక పై సొంతంగా ల్యాండింగ్ చేసిన దేశంగా అవతరించింది.
ట్రయల్స్ లో భాగంగా తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, మిగ్ 29కే లను భారత నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ పై విజయవంతంగా ల్యాండ్ చేసింది.
భారతదేశ చరిత్రలో ఇది అరుదైన మైలురాయిగా నిలిచిపోతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
రూ.20 వేల కోట్ల వ్యవయంతో నిర్మించిన 45 వేల టన్నుల బరువున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత నేవీలో ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కు ఫైటర్ జెట్స్, విమానాలను దాదాపు 30 వరకు తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.