Kashmir Snowfall Photos: భూతల స్వర్గాన్ని తలపిస్తున్న కాశ్మీర్, మంచుతో కళకళలాడుతున్న అందాలు
జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో మంచు (Snow) పరుచుకుంది. దీంతో ఈ పర్యటక ప్రదేశాలు మరింత అందంగా మారాయి. గుల్మార్గ్, సోనమర్గ్, పహల్గామ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు తాజాగా కురిసిన మంచు తో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు గుల్మార్గ్లో కురిసిన మంచు తో ఈ ప్రాంతం లో పర్యాటకులు సందడి చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాశ్మీర్ పర్యాటక రంగానికి సరికొత్త జోష్: శీతాకాలం ప్రారంభంలోనే మంచు కురుస్తుండటంతో కశ్మీర్ పర్యాటక రంగం ఊపందుకుంది. గుల్మార్గ్ స్కీ రిసార్ట్‌లో రోజుకు సగటున 2,500 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 11.5 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కశ్మీర్‌కు 2.6 మిలియన్ మంది పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 35 వేల మందికిపైగా విదేశీయులున్నారు. తాజా మంచు కురుస్తుండటంతో పర్యాటక రంగం మరింత పుంజుకునే అవకాశముందని కశ్మీర్ టూరిజం అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చినాబ్ వ్యాలీలో పెరిగిన పర్యాటకుల తాకిడి: చినాబ్ వ్యాలీలోని భదర్వాహ్ ప్రాంతం కూడా తాజా మంచుతో పర్యాటకులను మైమరిపిస్తోంది. సముద్ర మట్టానికి 9,555 అడుగుల ఎత్తులో ఉండే గుల్దండా లో శనివారం రాత్రి నుంచి మంచు కురుస్తుండటంతో మంచుతో కప్పుకుంటున్న ఈ ప్రాంతం కొత్త అందాన్ని సంతరించుకుంది.
శ్రీనగర్ నుంచి ప్రయాణం: గుల్మార్గ్: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి 60 కిమీ (1.5–2 గంటలు) ప్రయాణిస్తే గుల్మార్గ్ చేరుకోవచ్చు. ప్రైవేట్ టాక్సీ ధర: ₹2,500–₹3,000. శ్రీనగర్ నుంచి టాంగ్మార్గ్. అక్కడినుంచి gulmarg కు ప్రైవేటు టాక్సీ అందుబాటు లో ఉంటాయి. మంచు పరిస్థితుల తరుణంలో చైన్ వాహనాలు తప్పనిసరి అని కాశ్మీర్ టూరిజం అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: శ్రీనగర్ నుంచి టాంగ్మార్గ్ వరకు బస్సులు, ఆపై షేర్డ్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. చూడవలసిన ప్రదేశాలు: దాల్ సరస్సు, టాంగ్మార్గ్ మార్కెట్, బాబా రేషీ శ్రైన్, డ్రుంగ్ వాటర్‌ఫాల్.
సోనమార్గ్: శ్రీనగర్ నుంచి 80 కిమీ (2.5–3 గంటలు) ప్రయాణిస్తే Sonmarg చేరుకోవచ్చు. ప్రైవేట్ టాక్సీ ధర: ₹3,000–₹4,000. షేర్డ్ టాక్సీలు ధర: ₹400–₹600. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: శ్రీనగర్ నుంచి ప్రైవేట్ బస్సులు, షేర్డ్ కాబ్స్ అందుబాటులో ఉన్నాయి. చూడవలసిన ప్రదేశాలు: సింధు నది, చుట్టూ ఉండే మంచు పర్వతాలు.
పహల్గామ్: శ్రీనగర్ నుంచి 108 కిమీ (3–4 గంటలు) ప్రయాణిస్తే పహల్గామ్ చేరుకోవచ్చు. ప్రైవేట్ టాక్సీ ధర: ₹2,500–₹3,500. షేర్డ్ టాక్సీలు ₹250 (శ్రీనగర్ నుంచి అనంతనాగ్, ఆపై పహల్గామ్). పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: ప్రైవేట్ బస్సులు లేదా అనంతనాగ్ వరకు షేర్డ్ కాబ్స్, ఆపై టాక్సీలు. ఆకర్షణలు: కేశర తోటలు, అవంతిపురా అవశేషాలు, కశ్మీర్ బ్యాట్ ఫ్యాక్టరీలు.
జమ్మూ నుంచి ప్రయాణం: రైలు: జమ్మూ నుంచి బనిహాల్ వరకు రైలు సౌకర్యం ఉంటుంది. బనిహాల్ నుంచి శ్రీనగర్ వరకు షేర్డ్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం: జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణం 6–8 గంటలు. ప్రైవేట్ టాక్సీలు ₹5,000–₹7,000 వరకు ఛార్జ్ చేస్తారు. శీతాకాలంలో ప్రయాణ సూచనలు: - మంచు కురుస్తున్న సమయంలో ముందుగా వాహనాలు బుక్ చేసుకోవడం మంచిది. - చైన్ వాహనాలు తప్పనిసరిగా టాంగ్మార్గ్ వంటి ప్రాంతాల్లో అవసరమవుతాయి. - గుల్మార్గ్, సోనమార్గ్ వంటి ప్రాంతాల్లో రాత్రి ఉండే ప్లాన్ చేయడం ఉత్తమం. - పర్యాటక సైట్లు, రోడ్డు పరిస్థితులు మారవచ్చు, కాబట్టి ముందుగా స్థానిక సమాచారం తెలుసుకోవడం ఉత్తమం
మంచు కురుస్తున్న సమయంలో కశ్మీర్ పూర్తిగా ప్రకృతి ప్రేమికులకు పండుగలా మారుతుంది. ఈ శీతాకాలం హిమపర్వత ప్రదేశాల అందాలను ఆస్వాదించడానికి చక్కటి సమయం. ఈ తరుణంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జమ్మూ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు.