New Flat: కొత్త ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? - ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

కొత్తగా ఫ్లాట్ తీసుకోవాలనుకునే వారు దానికి సంబంధించి అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. కొనాలనుకున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అన్నీ చెక్ చేసుకోవాలి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఫ్లాట్‌ను చూసుకుని అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఓకే అనుకున్న తర్వాత బుకింగ్ అమౌంట్ 10 శాతం చెల్లించాలి. అనంతరం నగదు చెల్లించినట్లు రిసీప్ట్ తీసుకోవాలి. అలాగే, బిల్డర్ నుంచి ఫ్లాట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి.

అనంతరం అమ్మకం ఒప్పందం (Sale Agreement) చేసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా బిల్డర్, కొనుగోలుదారునికి మధ్య పక్కాగా ఒప్పందం చేసుకోవాలి.
అనంతరం హోమ్ లోన్ ప్రాసెస్ చూసుకోవాలి. మంత్లీ ఈఎంఐలు వంటి వాటిపై పూర్తి అవగాహనతో ఉండాలి. బ్యాంకులో హోంలోన్ దరఖాస్తు సమర్పించిన అనంతరం మేనేజర్‌తో చర్చించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆమోదం తర్వాత ఆస్తి పత్రాల తనిఖీ, ఆన్ సైట్ ఎస్టిమేషన్ అంచనాల అనంతరం హోమ్ లోన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఒప్పందం ప్రకారం ఫ్లాట్ నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుండగా దశలవారీగానే నగదు చెల్లింపులు ఉండాలి. భవనంలో చేపట్టిన నిర్మాణాలకు అనుగుణంగానే చెల్లింపులు జరగాలి.
ఒకవేళ అనుకున్న సమయానికి బిల్డర్ బిల్డింగ్‌ను అప్పగించలేకపోతే 10 శాతం వడ్డీతో సహా నగదు చెల్లించాల్సి ఉంటుంది.
భవన నిర్మాణ ప్రక్రియ పూర్తైన అనంతరం సేల్ డీడ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇది బిల్డర్ నుంచి కొనుగోలుదారుకు భవనాన్ని బదిలీ చేయడానికి హామీ ఇచ్చే కీలక చట్టపరమైన పత్రం. ఇది లేకుండా ఆస్తి లావాదేవీ ప్రక్రియ పూర్తి కాదు. అలాగే చట్టబద్ధం కూడా కాదు.
సేల్ డీడ్ ప్రక్రియ పూర్తైన అనంతరం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇది ఫ్లాట్ కొనుగోలుదారునికి అసలైన రుజువుగా పరిగణిస్తారు.