In Pics: జలియన్ వాలాబాగ్ నరమేధానికి 105 ఏళ్లు, సరిగ్గా 20 ఏళ్లకి ప్రతీకారం - ఫోటోలు
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత దురాగతమైన సంఘటనల్లో జలియన్ వాలాబాగ్ నరమేధం ఒకటి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅది 1919 ఏప్రిల్ 13. పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ పర్వదినం ఆ రోజు.
అలా వేలాది మంది ప్రజలు అమృత్ సర్ నగరంలోని జలియన్ వాలాబాగ్ తోటలో సమావేశం అయ్యారు.
బ్రిటీష్ పరిపాలకులు ప్రవేశ పెట్టిన క్రూరమైన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
అదే సమయంలో బ్రిగేడియర్ జనరల్ రేగినాల్డ్ డయర్ తన సైన్యంతో ఈ తోటలోకి చొరబడి విచక్షణా రహితంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కాల్పులు జరిపాడు.
సాదారణ భారత పౌరుల మీద తుపాకులతో కాల్పులు కురిపించారు. 10 నిమిషాలు పాటు 50 మంది సైనికులతో 1,650 రౌండ్లు కాల్పులు జరిపారు.
అలా ఈ దుర్ఘటనలో అధికారికంగా 379 తమ ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయలు పాలయ్యారు.
కాంపౌండ్ చుట్టూ ఇటుక గోడ ఉండడం అక్కడి నుంచి తప్పించుకునేందుకు మార్గం లేకపోవడం కారణంగా చాలా మంది మరణించారు.
ఆ ప్రాంగణం మొత్తానికి ఒకే ద్వారం.. అందులోనూ రాకపోకలకు చిన్న ద్వారం ద్వారా మాత్రమే ఉంది. దీంతో జనాలు బయటకు పోలేకపోయారు.
జనరల్ రెజినాల్డ్ డాటర్ డయర్ తన సైన్యంతో కలిసి ప్రవేశ ద్వారాలు మూసి వేసి ఈ మారణ హోమానికి తెగబడ్డారు.
అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైఖెల్ ఓ డయర్ ఈ ఘటనకు ముఖ్య బాధ్యుడు.
ఈ ఘటన జరిగిన 20 ఏళ్ళ తరువాత 1940 లో స్వాతంత్ర సమర యోధుడు అయిన ఉద్దం సింగ్ ఆ ముఖ్య బాధ్యుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు.
అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మైఖైల్ ఓ డయర్ ను లండన్ లోని కాక్స్టన్ హాల్ లో తుపాకీ తో గురి పెట్టి కాల్చి.. 20 ఏళ్ళ తరువాత జలియన్ వాలాబాగ్ నరమేధానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
సామాన్య పౌరులపై బ్రిటీష్ సైన్యం జరుపుతున్న నరమేధం