Wayanad Tragedy: వయనాడ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూశారా, ABP దేశం ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
వయనాడ్ విధ్వంసంలో మృతుల సంఖ్య 358కి పెరిగింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 300 మంది గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నారన్న అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవయనాడ్‌లో పరిస్థితులపై ABP దేశం గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. మందక్కై, చూరల్‌మల్ ప్రాంతాల్లో ఇళ్లు ఇలా బురదలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహాన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల అయితే అసలు అక్కడ ఇళ్లు ఉన్న దాఖలాలు కూడా లేకుండా చేసింది ఈ విపత్తు.
వరద ఉద్ధృతికి బలమైన నిర్మాణాలు కూడా కూలిపోయాయి. వాటి స్థానంలో అక్కడ ఇలా బండరాళ్ల ఆనవాళ్లు మాత్రమే మిగిలిపోయాయి. అన్ని చోట్లా మట్టి దిబ్బలే కనిపిస్తున్నాయి.
మరమ్మతు చేసే అవకాశం కూడా లేని స్థాయిలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పట్లో అసలు కోలుకుంటామో లేదో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ అందరిలోనూ ఏదో తెలియని భయం మాత్రం అలాగే ఉండిపోయింది.
పలు చోట్ల ఇళ్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఎప్పుడైనా పైకప్పు ఊడిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ఇళ్లలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతోంది.
కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను రెస్క్యూ టీమ్ పరిశీలిస్తోంది. జాగ్రత్తగా అక్కడి శిథిలాల్ని తొలగిస్తోంది. వాటి కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే సురక్షితంగా బయటకు తీసుకొస్తోంది. సహాయక చర్యలు ఐదో రోజుకు చేరుకున్నాయి. బాధితులను గుర్తించేందుక రేడార్ డ్రోన్‌లు వినియోగిస్తున్నారు.
సహాయక చర్యల్లో డాగ్‌స్క్వాడ్‌లు కూడా కీలకంగా మారాయి. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఓ బృందం ఇక్కడికి వచ్చింది. కేవలం టెక్నాలజీపైనే ఆధారపడకుండా ఇలా డాగ్‌స్వ్కాడ్‌తోనూ రెస్క్యూ కొనసాగిస్తున్నారు.
ఈ కుక్కలు బురదలో 2-5 అడుగుల లోతులో కూరుకుపోయిన మనుషుల వాసననూ పసిగడతాయి. సహాయక చర్యల్లో రెస్క్యూ టీమ్‌కి ఇవి ఎంతగానో సహకరిస్తున్నాయి. థర్మల్ స్కానర్‌లతో పాటు డాగ్‌స్క్వాడ్‌పైనా ఆధారపడుతున్నారు అధికారులు.