Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దాడి, భూగర్భ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న ఉక్రెయిన్ వాసులు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై 'మిలిటరీ ఆపరేషన్' ప్రారంభించారు. దీంతో ఉక్రెయిన్ రాజధాని మెట్రోస్టేషన్ లలో ప్రజలు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. బ్యాగ్‌లు, సూట్‌కేస్‌లను తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. (Source: AFP Photo Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రకటించిన వెంటనే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. వైమానిక దాడి సైరన్లు వినిపిస్తున్నాయి.(Source: AFP Photo Twitter)
సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. పౌరులపై దాడులు చేయమని హామీ ఇచ్చినప్పటికీ, భయంతో ఉక్రెయిన్ వాసులు భూగర్భ మెట్రో స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కీవ్‌లోని ప్రజలు నగరంలోని భూగర్భ మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందుతున్నారు.(Source: AFP Photo Twitter)
కీవ్ నగరంలో విస్తృతమైన సబ్వే వ్యవస్థ ఉంది. వీటిని బాంబు షెల్టర్లుగా వినియోగిస్తున్నారు. ఇది తూర్పు ఐరోపా దేశంలోని పురాతన అతిపెద్ద భూగర్భ నెట్వర్క్ వ్యవస్థ. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ లో మార్షల్ లా విధించారు. కైవ్‌లోని ప్రజలు భూగర్భ మెట్రో స్టేషన్లకు వెళ్లడం కనిపించిందని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ నివేదించింది. (Source: AFP Photo Twitter)