World Kidney Cancer Day: ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం: ఈ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీలను సేఫ్ గా ఉంచుకోవచ్చు!
కిడ్నీ క్యాన్సర్ వచ్చాక ఇబ్బంది పడటం కంటే, రాకుండా కాపాడుకోవడమే ఉత్తమం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..Photo Credit: Pixabay.com
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఊబకాయం అనేది కిడ్నీ క్యాన్సర్ కు ప్రధాన కారణం. వీలైనంత వరకు అధిక బరువును కంట్రోల్ చేసుకోవడం మంచిది. సమతుల ఆహారం, శారీరక శ్రమ ద్వారా బరువును తగ్గించుకునే అవకాశం ఉంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడంతో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్స్, చెక్కెరను వీలైనంత వరకు దూరం పెట్టాలి. Photo Credit: Pixabay.com
కిడ్నీలు సేఫ్ గా ఉండాలంటే సరిపడ నీళ్లు తాగడం చాలా అవసరం. రోజుకు సుమారు 4 లీటర్ల నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. Photo Credit: Pixabay.com
కిడ్నీ క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణం పొగ తాగడం. ధూమపానం మానేయడం వల్ల కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంది. పొగ తాగడం ఒకేసారి మానలేకపోయినా, రోజు రోజుకూ తగ్గించుకుంటూ వెళ్లడం మంచిది. Photo Credit: Pixabay.com
పెయిన్ కిల్లర్స్ కూడా కిడ్నీ క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ లాంటటి నాన్ ప్రిస్క్రిప్షన్ ఔషధాలు ఎక్కువ రోజులు వాడటం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించడం మంచిది. Photo Credit: Pixabay.com
చక్కటి ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు క్యాన్సర్ ముప్పును దూరం చేసుకోవచ్చు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వాటిని తీసుకోకపోవడం మంచిది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఫుడ్ తినాలి. Photo Credit: Pixabay.com
కనీసం ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. కిడ్నీలలో ఏవైనా సమస్యలు ఉంటే ముందస్తుగా గుర్తించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు గతంలో ఎవరికైనా కిడ్నీ సంబంధ సమస్యలు ఉంటే, మరింత జాగ్రత్త పడితే బాగుంటుంది. రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్ వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.Photo Credit: Pixabay.com
హైబీపీ కిడ్నీలను డ్యామేజ్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వీలైనంత వరకు బీపీ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించడంతో పాటు, క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడం వల్ల బీపీని అదుపు చేసుకోవచ్చు. Photo Credit: Pixabay.com