Easy Moves to Lose Belly Fat at Home : బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే సింపుల్ ఎక్సర్సైజ్లు ఇవే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
ప్లాంక్ బరువు తగ్గించడంతో పాటు పొట్ట కొవ్వును వేగంగా కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని 30 నుంచి 60 సెకన్లు చేయాలి. 30 సెకన్లు రెస్ట్ తీసుకోవాలి. ఇలా 3 నుంచి 5 సార్లు రిపీట్ చేయాలి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబైస్కిల్ క్రంచెస్ చేస్తే కూడా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. దీనికోసం నేలపై పడుకుని చేతులను తలకింద పెట్టుకోవాలి. కుడి మోచేయిని ఎడమ మోకాలును తాకేలా.. ఎడమ మోచేయి కుడి మోకాలును తాకేలా ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. దీనిని 15 నుంచి 20 సార్లు చేయాలి. మొత్తంగా మూడు సెట్లు చేయాలి.
రష్యన్ ట్విస్ట్స్ చేసేందుకు నేలపై కూర్చోవాలి. మోకాలను దగ్గరికి తీసుకుని పాదం నేలపై సమాంతరంగా ఉండేలా పెట్టాలి. ఇప్పుడు శరీరాన్నిసైడ్స్ టూ సైడ్ చేయాలి. ఇవి కూడా 15 నుంచి 20 సార్లు చేయాలి. 3 సెట్స్ చేయాలి.
లెగ్ రైజైస్ చేయడానికి నేలపై పడుకోవాలి. చేతులను నేలపై చాపాలి. ఇప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపాలి. ఒక్కో సెట్‌కి 15 నుంచి 20 సార్లు చేయాలి. మూడు సెట్లు చేయాలి.
మొంటైన్ క్లైయింబర్స్ చేసేందుకు ప్లాంక్ పొజేషన్‌లో ఉండాలి. ఇప్పుడు మోకాలిని ఛాతి వరకు తీసుకురావాలి. దానిని వెనక్కి తీసుకెళ్లిన వెంటనే మరోసారి మోకాలిని ఛాతి వరకు తీసుకురావాలి. ఇలా వేగంగా చేయాలి. దీనిని 30 నుంచి 60 సెకన్లు చేయాలి. మూడు సెట్లు చేయాలి.
ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. యోగా ఆసనాలు కూడా శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేసి.. కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.
ఇవి రెగ్యూలర్‌గా చేస్తూ.. హెల్తీ డైట్ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. యోగా, మెడిటేషన్ చేస్తూ ఉండాలి.