Papaya Leaf Juice : బొప్పాయి ఆకులరసాన్ని పరగడుపున తీసుకుంటే ఎన్ని లాభాలో.. బ్లడ్ షుగర్ ఉన్నవారికి ఇంకా మంచిదట
బొప్పాయి ఆకుల రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్లు ఏ, సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఆకుల రసంలో పాపైన్, ప్రోటీజ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియకు మద్ధతునిస్తాయి. అంతేకాకుండా ఐబీఎస్ లక్షణాలు తగ్గించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌తో నిండిన ఈ రసం ఆర్థరైటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. గౌట్, ఇతర ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వాపును దూరం చేస్తుంది.
మధుమేహమున్నవారు దీనిని తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఈ విషయాన్ని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి కూడా. అందుకే బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడానికి దీనిని కొందరు తీసుకుంటారు.
కాలేయ సమస్యలను అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ మీరు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. దీనిని కచ్చితంగా తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.
10-15 బొప్పాయి ఆకులు తీసుకుని.. దానిలో రెండు కప్పుల నీళ్లు వేసి జ్యూస్ చేయాలి. ఆ రసాన్ని వడకట్టి తాగవచ్చు. లేదంటే తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. దీనిని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
ముఖ్య గమనిక ఏంటంటే.. దీనిని మీరు తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. మెడికల్ సమస్యలు, అలెర్జీలు ఉంటే కచ్చితంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాకే.. దీనిని తీసుకోవాలి.