Anant ambani wedding: నీతా అంబానీ మెహందీలో అంత స్పెషల్ ఉందా!
ముంబై వేదికగా అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో నీతా అంబానీ పెట్టుకున్న మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఆమె మెహందీలో తనకు కుటుంబం అంటే ఎంతో ఇష్టం అని తెలిపేలా కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె తన చేతుల మీద పురాతన భారతీయ వివాహ సంప్రదాయం ప్రకారం ఆమె తన అరచేతులపై రాధా-కృష్ణల అందమైన రూపాలు వేయించుకున్నారు. ఇవి కొత్త జంట అనంత్-రాధికలను సూచిస్తుంది.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ వేడుకల్లో నీతా అంబానీ కట్టుకున్న ప్రతి చీరా ప్రత్యేకమే. అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన మాతా కీ చౌకి (దుర్గామాత పూజ) నీతా అంబానీ హైలెట్గా నిలిచారు.
ఈ వేడుకలో నీతా అనురాధ వకీల్ డిజైన్ చేసిన ఎరుపు రంగు గుజరాతీ ఘర్చోలా చీరలో మెరిసిపోయారు. చీర మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. ఇక చీరకు తగ్గట్టే మ్యాచింగ్ నెక్సెట్, చెవిపోగులు, గాజులు ధరించారు.
వివాహం కోసం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్కు వరుడి తల్లి నీతా అంబానీ, అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన పీచు సిల్క్ ఘాగ్రాను ధరించారు.