Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Radhika Merchant: కొత్త పెళ్లికూతురు రాధిక అత్తగారితో పోటీ పడేది ఏ విషయంలోనో తెలుసా!
ఆసియాలోని అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ , ఆమె ఏమి చదువుకుంది ఆమె ప్రస్తుతం ఏమి చేస్తోంది అనే ప్రశ్నలు అందరి మనస్సులోను ఉన్నాయి .
Download ABP Live App and Watch All Latest Videos
View In App29 ఏళ్ల రాధిక 1994 డిసెంబర్ 18 న జన్మించారు . ప్రపంచ ఔషధ తయారీ సంస్థ ' ఎంకోర్ హెల్త్‌కేర్ ' CEO విరేన్ మర్చంట్ మరియు శైలా మర్చంట్ యొక్క కుమార్తె .
రాధికా స్కూలింగ్ అంటా ముంబైలోజరిగింది. తరువాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది . భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇస్ప్రవాలో ఒక సంవత్సరం పాటు పని చేసింది.
ప్రస్తుతం రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. రాధిక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం , వ్యాపారంతో పాటు, ఆమెకు పౌర హక్కులు , ఆర్థిక సాధికారత , విద్య మరియు ఆరోగ్య రంగాలలో ఆసక్తి ఉంది.
చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే భరతనాట్యంలో నీతా అంబానీతో కోడలు రాధిక మర్చంట్ పోటీపడుతుంది. ఎందుకంటే రాధిక ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ కూడా . ఆమె ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ నుండి ఎనిమిదేళ్లు భరతనాట్యం పాఠాలు కూడా నేర్చుకుంది .
మీడియా లెక్కల ప్రకారం , రాధిక మర్చంట్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 10 కోట్లు . వాళ్ళ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ. 750 కోట్లు . విరెన్ మర్చంట్ భారతదేశంలోని అనేక పెద్ద కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు, ఇందులో ఎన్‌కోర్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌కోర్ నేచురల్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ZYG ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సాయి దర్శన్ బిజినెస్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎన్‌కోర్ పాలీఫ్రాక్ ఉత్పత్తులు ఉన్నాయి.
రాధికా మర్చంట్ చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. వివాహ వేడుకలో కూడా ఆమె చాలా లైట్ అండ్ మినిమమ్ మేకప్ లోనే ఈమె కనిపించింది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు చిన్న నాటి స్నేహితులు. 2018లో అనంత్, రాధిక కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో వీరిద్దరికీ ముందే పరిచయం ఉందన్న విషయం బయట పడింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహానికి కూడా రాధిక హాజరయ్యారు.