Varalaxmi Sarathkumar Wedding: ఒకరోజు పూర్తయ్యింది - పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ వరలక్ష్మి శరత్‌కుమార్ సంతోషం

అసలు పెళ్లిపై ఇంట్రెస్టే లేదు అని చెప్పే వరలక్ష్మి శరత్‌కుమార్.. నికోలయ్ సచ్దేవ్ అనే గ్యాలరిస్ట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
జులై 10న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వరలక్ష్మి, నికోలయ్ పెళ్లి జరిగింది. పెళ్లయిన కాసేపటికే దీనికి సంబంధించిన ఫోటోలు బయటికొచ్చాయి.

ఈ పెళ్లి ఫోటోలను సంతోషంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫెయిరీటైల్ వెడ్డింగ్ అంటూ తన పెళ్లి గురించి సంతోషం వ్యక్తం చేసింది.
‘నా ప్రిన్స్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను చేసుకున్నాను. ఒకరోజు పూర్తయ్యింది. ఇంకా జీవితాంతం ఉంది’ అంటూ నికోలయ్‌కు ఐ లవ్ యూ చెప్తూ ఈ ఫోటోలను షేర్ చేసింది.
పెళ్లిలో తను అందంగా కనిపించేలా చేసిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్. తను ప్రపంచంలోనే అందమైన పెళ్లికూతురిలాగా కనిపిస్తున్నానని మురిసిపోయింది.
వరలక్ష్మి, నికోలయ్ పెళ్లి ఫోటోలను తన ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం లైకులు కొడుతూ కంగ్రాట్స్ చెప్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వారి పెళ్లికి విషెస్ తెలిపారు.
ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లిని కూడా కేవలం సన్నిహితుల సమక్షంలోనే చేసుకుంది వరలక్ష్మి. ఈ వేడుకలో రెడ్ కలర్ పట్టుచీరలో మెడలో గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్‌తో అందంగా ముస్తాబయ్యింది.