Sundeep Kishan : ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కోసం ఫిజిక్‌ని మార్చుకున్న సందీప్ కిషన్.. డైట్ టిప్స్ చెప్పేసిన హీరో
సందీప్ కిషన్ తన బాడీని సూపర్‌గా ట్రాన్స్ఫార్మేషన్ చేసుకున్నారు. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కోసం తన లుక్స్‌ని మార్చుకుంటున్నట్లు తెలిపారు. (Image Source :Instagram/Sundeep Kishan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనటన విషయంలో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ నీ బాడీని మార్చి చూపించని రాజ్ అండ్ డీకే చెప్పినట్లు సందీప్ తెలిపాడు. దానికోసమే తన లుక్స్‌ని మార్చుకుంటున్నట్లు వివరించాడు. (Image Source :Instagram/Sundeep Kishan)
రోజూ జిమ్ చేయడం, డైట్ విషయంలో మాత్రం ఎక్కువ మార్పులు చేయనని.. సింపుల్ టిప్స్ మాత్రం ఫాలో అవుతానని తెలిపాడు. (Image Source :Instagram/Sundeep Kishan)
వర్క్ అవుట్ రోజుకి రెండు సార్లు చేస్తాడ. డైట్ విషయంలో చెత్త తినడట. షుగర్, ఫ్రైడ్ ఫుడ్ తినడట. సోడాలు తాగరట. ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకోనని చెప్పాడు సందీప్.(Image Source :Instagram/Sundeep Kishan)
రోజూ మధ్యాహ్నం రైస్ తింటారట. చేపల పులుసు రైస్ ఎక్కువగా తింటాడట సందీప్. లేదంటే మూడు రకాల వెజ్ కర్రీలతో నెయ్యి వేసుకుని తింటారట.(Image Source :Instagram/Sundeep Kishan)
రాత్రుళ్లు చేపలు, ఎగ్స్, అవకాడో, చికెన్ తింటాడట. బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్, నట్స్ తింటాడట. క్లీన్, హెల్తీ ఫుడ్‌ని తీసుకోవడం వల్లే తాను హెల్తీగా, ఫిట్‌గా ఉంటున్నట్లు సందీప్ తెలిపాడు.(Image Source :Instagram/Sundeep Kishan)