Guava Buying Tips : జామపండ్లు కొనేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. తియ్యనివి మీ సొంతమవుతాయి
పండిన జామకాయ లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే పండనిది. బాగా పసుపు రంగులో ఉంటే ఎక్కువ పండినది అని అర్థం. సరైన రంగులో ఉన్న జామకాయ చాలా తీయగా, రుచికరంగా ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదోర జామపండు తేలికపాటి తీపి వాసన వస్తుంది. ఇది దాని పక్వతకు సంకేతం. వాసన లేని జామకాయ పచ్చిగా ఉంటుంది. బాగా వాసన వస్తే అది చెడిపోయినదని అర్థం.
జామకాయను మెల్లగా నొక్కండి. అది కొంచెం మెత్తబడి తిరిగి మామూలుగా వస్తే సరిగ్గా ఉన్నట్టు లెక్క. బాగా గట్టిగా ఉంటే పచ్చిగా ఉన్నట్టు.. బాగా మెత్తగా ఉంటే పాడైపోయినట్టు.
స్వచ్ఛమైన, నునుపైన ఉపరితలం కలిగిన జామను ఎంచుకోండి. కోసిన లేదా దెబ్బతిన్న పండులో రుచి, ఆకృతి మంచిగా ఉండదు.
మచ్చలున్న జామకాయలను తీసుకోకండి. గుండ్రంగా ఒకే ఆకారంలో ఉన్న జామకాయలు సాధారణంగా తీయగా ఉంటాయి. ధూళి, పురుగుమందులను తొలగించడానికి జామకాయలను చల్లటి నీటితో కడిగిన తర్వాతే తినాలి.
ఎల్లప్పుడూ జామకాయను మధ్యలో కోసువాలి. కావాలంటే గింజలను తీసివేయండి. ఉప్పు-మిరపకాయ వేసుకుని తింటే రుచి రెట్టింపు అవుతుంది.
జామపండు ప్రతి సీజన్లోనూ లభిస్తుంది. ఏ సమయంలోనైనా తినగలిగే హెల్తీ స్నాక్. కాబట్టి దానిని కొనేప్పుడు.. ప్రతిసారీ తీపిగా, జ్యూసీగా ఉండే జామపండును ఎంచుకుంటే మంచిది.