Whisky Drinking Tips : పర్ఫెక్ట్ విస్కీ పెగ్ ఎలా మిక్స్ చేయాలో తెలుసా? 99 శాతం మంది చేసే తప్పులు ఇవే
విస్కీ తాగేందుకు రాక్స్ గ్లాస్ లేదా టంబ్లర్ చాలా సరైనదిగా చెప్తారు. ఈ తరహా గ్లాసు విస్కీ వాసన, రుచిని ఒకే విధంగా ఉంచుతుంది.
విస్కీ బాటిల్ తెరిచిన తర్వాత కొంచెం సేపు గాలికి వదలండి. వైన్‌ను గాలికి వదిలినట్లుగానే.. విస్కీని కూడా 1 నుంచి 2 నిమిషాల సమయం వదిలేయాలి. దీనివల్ల వాసన వికసిస్తుంది.
కొంతమంది విస్కీలో నీరు కలపడం తప్పు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే కొద్దిగా నీరు కలపడం వల్ల విస్కీ రుచి పెరుగుతుంది. అయితే ఎక్కువ నీరు కలపకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే డ్రింక్ రుచి పోతుంది.
చిన్న ఐస్ క్యూబ్స్ త్వరగా కరిగిపోయి విస్కీని నీరుగా చేస్తాయి. కాబట్టి పెద్ద ఐస్ క్యూబ్స్ లేదా విస్కీ స్టోన్స్ ఉపయోగిస్తే మంచిదట. దీనివల్ల డ్రింక్ చల్లగా ఉంటుంది. కానీ రుచి మారదు.
విస్కీని ఎప్పుడూ ఎక్కువగా కదిలించకూడదు లేదా కలపకూడదు. ఇది దాని సహజ రుచిని నాశనం చేస్తుంది. దీనివల్ల అన్ని రుచులు బయటకు వస్తాయి.
విస్కీలో సోడా లేదా జ్యూస్ కలుపుతున్నట్లయితే దాని నాణ్యతపై శ్రద్ధ వహించండి. చెడు మిక్సర్ విస్కీ రుచిని పూర్తిగా పాడు చేస్తుంది. కాబట్టి బ్రాండెడ్ లేదా చల్లని సోడాను మాత్రమే ఉపయోగించండి.
ఖచ్చితమైన పెగ్ అంటే కొలత మాత్రమే కాదు.. అనుభవం కూడా. దాదాపు 30 నుంచి 60 ml సరిపోతుంది. విస్కీ ఎక్కువ తాగితే ఆనందాన్ని పెంచదు. కానీ మరుసటి రోజు ఉదయం తలనొప్పిని ఖచ్చితంగా పెంచుతుంది. కాబట్టి లిమిటెడ్‌గా తీసుకోవాలి.