Mangoes in Monsoon : వర్షాకాలంలో మామిడి పండ్లు తినొచ్చా? శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే
నిపుణుల ప్రకారం వర్షాకాలంలో మామిడిపండ్లు తినకపోవడమే మంచిదట. ఎందుకంటే తేమ, వర్షం కారణంగా మామిడి తొక్కలపై బూజు, బ్యాక్టీరియా పెరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
వర్షాకాలంలో మామిడి పండ్లు త్వరగా పాడైపోతాయి. మామిడి పండు బయటకు బాగానే కనిపిస్తుంది కానీ.. వాటిని లోపల నుంచి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశముంది.
వర్షాకాలంలో మామిడి పండ్లను పిల్లలకు కూడా పెట్టకపోవడమే మంచిది. పిల్లలు మరింత సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి.. మామిడిపై ఉండే బ్యాక్టీరియా వారికి ఇబ్బంది కలిగించవచ్చు.
వర్షాకాలంలో మామిడి పండ్లు తింటే స్కిన్ అలెర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అలెర్జీలు, దద్దుర్లు, మొటిమలు వంటివి వస్తాయి. కాబట్టి స్కిన్ సెన్సిటివిటీ ఉండేవారు వాటికి దూరంగా ఉంటే మంచిది.
ఒకవేళ వర్షాకాలంలో మామిడి పండ్లు తినాలి అనుకుంటే.. ముందుగా వాటిని బాగా కడిగి తినాలి. అలాగే కుళ్లిపోయిన పండ్లు కూడా తినకపోవడమే మంచిది. కొన్నిపండ్లలో పురుగులు ఉంటాయి కాబట్టి సరిగ్గా చూసుకొని తింటే మంచిది. లేదంటే అలర్జీలు వచ్చే అవకాశముంది.