Tips to Reduce Hangover : డ్రింక్ ఎక్కువగా చేశారా? హ్యాంగోవర్ తగ్గించుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అయిపోండి
మద్యం ఎక్కువగా తీసుకున్న తర్వాత పదేపదే మూత్రం వస్తుంది. దీనివల్ల శరీరం నుంచి ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల తలనొప్పి, అలసట, దాహం వంటి సమస్యలు వస్తాయి. దీనిని హ్యాంగోవర్ అంటారు.
మద్యం తీసుకున్న తర్వాత అది అరిగేప్పుడు ఎసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇది టాక్సిక్ పదార్థం. దీనివల్ల తలనొప్పి, వాంతులు అవుతాయి. అలాగే తాగిన వెంటనే నిద్ర వస్తుంది కానీ లాంగ్ రన్లో నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.
మద్యం సేవించడం వల్ల సైటోకిన్స్ స్థాయిలు పెరిగి.. వాపు, హాంగోవర్ లక్షణాలు పెంచుతాయి. అలాగే విస్కీ, రెడ్ వైన్ వంటివి ముదురు రంగులో ఉంటాయి. ఈ కాంజెనర్స్ హ్యాంగోవర్ తీవ్రతను పెంచుతాయి.
అడిక్షన్ జర్నల్లో పబ్లిష్ అయిన ఓ స్టడీ ప్రకారం.. హ్యాంగోవర్ అనేది తీసుకున్న ఆల్కహాల్, మగ, ఆడ, వయసు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మహిళలు పురుషులతో సమానంగా మద్యం సేవిస్తే.. ఆమెకు హ్యాంగోవర్ ఎక్కువ అవ్వొచ్చు.
యూకె చీఫ్ మెడికల్ ఆఫీసర్ల మార్గదర్శకాల ప్రకారం.. పురుషులు రోజుకు 2 డ్రింక్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. మహిళలు 1 డ్రింక్ వరకు పరిమితం చేయాలి. ఒక డ్రింక్ అంటే 360 ml 5% బీరు, 150 ml 12% వైన్ లేదా 45 ml 40% లిక్కర్. నెమ్మదిగా, లిమిటెడ్గా తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ ప్రమాదం తగ్గుతుంది.
ప్రతి డ్రింక్ తర్వాత ఒక గ్లాసు నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. నిద్రపోయే ముందు ఒక పెద్ద గ్లాసు నీరు తాగడం వల్ల శరీరంలో లిక్విడ్ లోపం ఉండదు. గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ మద్యం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
మద్యం సేవించే ముందు కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాస్తా, అవకాడో లేదా గింజలు వంటివి తీసుకోవాలి. ఇది మద్యం శోషణను తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల హ్యాంగోవర్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. వోడ్కా, జిన్ లేదా రమ్ వంటి తేలికపాటి మద్యంలలో కాంజెనర్స్ తక్కువగా ఉంటాయి. ఇది హ్యాంగోవర్ సమస్యను కూడా తగ్గిస్తాయి.