బిహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ 2025
(Source: Poll of Polls)
Dangerous Railway Routes : ఇండియాలోని ప్రమాదకర రైల్వే మార్గాలు ఇవే.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
కోరాపుట్ విశాఖపట్నం వెళ్లే మార్గం.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కొండలు, అడవుల గుండా వెళుతుంది. ఇక్కడ నక్సల్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇక్కడ ట్రాక్‌పై భారీ రాళ్లు పడటం, గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడం వంటి సంఘటనలు జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిమాచల్‌ప్రదేశ్‌లో 96 కిలోమీటర్ల పొడవైన కాలకా సిమ్లా మార్గం యునెస్కో గుర్తింపు పొంది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. అయితే ఇక్కడ వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, ట్రాక్‌పై జారడం, పాత వంతెనలపై నీరు చేరడం వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
కుర్సియాంగ్, డార్జిలింగ్ మార్గం.. చారిత్రక బొమ్మ రైలుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ ట్రాక్‌తో పాటు రహదారి ఉండటం వల్ల వాహనాలు ఢీకొనడం, దట్టమైన పొగమంచు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి.
మెట్టుపాళయం, ఊటీ నీలగిరి మౌంటెన్ రైల్వే మార్గం.. పచ్చని అడవులు, పర్వతాల గుండా వెళ్తుంది. ఇక్కడ వేగవంతమైన వాలు, మలుపులు, శిథిలమైన ట్రాక్ కారణంగా బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు జరుగుతాయి.
చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు మార్గం.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రాక్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మార్గంలో ఉన్న పంబన్ వంతెన హిందూ మహాసముద్రంపై నిర్మించారు. భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లపై నీరు చేరడం, మట్టి జారడం, రాళ్లు పడటం వంటివి రైలుకు పెద్ద ప్రమాదంగా మారుతాయి.
ఆ మార్గాల్లో ప్రమాదాలకు పాత ట్రాక్‌లు, మౌలిక సదుపాయాలు, సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణం, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, మానవ నిర్లక్ష్యం వంటివి కారణాలుగా ఉన్నాయి. ఇవి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
ప్రయాణికులు ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణం, భద్రతా సూచనలను తెలుసుకుని వెళ్తే మంచిది. అదే సమయంలో అధికారులు రైల్వే ట్రాక్, రైలును తనిఖీ చేసి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది.