Bottle Gourd : సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. కానీ ఆ తప్పు చేస్తే విషమే
సొరకాయ రుచి చేదుగా ఉంటే.. దానిని ఎప్పుడూ తినవద్దు. చేదు సొరకాయలో విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపు నొప్పి, వాంతులు, లూజ్ మోషన్ సమస్యలు కలిగిస్తుంది. మిగిలిన ఆహారానికి కూడా టాక్సిక్ అవుతుంది.
కొంతమందికి సొరకాయ తిన్న తర్వాత గ్యాస్, పొట్ట ఉబ్బరం లేదా అజీర్ణ సమస్య వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో తిన్నప్పుడు. సొరకాయ చల్లని స్వభావం జీర్ణవ్యవస్థను నెమ్మదింపజేస్తుంది.
సొరకాయ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు బాగా తగ్గవచ్చు. తక్కువ రక్తపోటు వల్ల మైకం, బలహీనత, అలసట వంటి సమస్యలు వస్తాయి.
సొరకాయలో మూత్రవిసర్జన గుణాలు ఉంటాయి. అంటే ఇది శరీరంలో నీటిని వేగంగా బయటకు పంపుతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల పదే పదే మూత్ర విసర్జన సమస్య ఏర్పడవచ్చు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది.
కొంతమందికి సొరకాయతో అలర్జీ ఉండవచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద లేదా మంట వంటివి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.
సొరకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ.. దాని రుచి, మోతాదు, సమయం చాలా ముఖ్యమైనవి. ఎల్లప్పుడూ తాజాగా, చేదు లేని సొరకాయను తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తినడం మానుకోండి.