Monsoon Hair Fall : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలడానికి కారణాలివే.. ఆ తప్పులు చేయకండి
వర్షాకాలంలో తేమ అధికంగా ఉంటుంది. ఇది స్కాల్ప్‌పై తేమను పెంచుతుంది. చెమట పెరగడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అంతేకాకుండా జుట్టు బలహీనంగా మారి రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జుట్టు తెగిపోవడానికి కూడా జరుగుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతేమ, చెమట వల్ల తలపై చుండ్రు పెరుగుతుంది. అంతేకాకుండా శిలీంధ్ర సంక్రమణలు పెరుగుతాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. దురద, చర్మం పొలుసులుగా ఊడిపోవడం వంటివి జరుగుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇన్ఫెక్షన్ వ్యాప్తి పెరిగి తీవ్రమవుతుంది.
వర్షాకాలంలో తీసుకునే ఫుడ్ కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. వేయించిన, ప్రాసెస్ చేసిన స్నాక్స్ ఎక్కువగా తింటారు. వీటిలో జుట్టు పోషణకు కావాల్సిన పోషకాలు ఉండవు. దీనివల్ల కుదుళ్లు వీక్ అవుతాయి. జుట్టు పలచడడం, రాలడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది.
వర్షంలో తడిచి.. వెంటనే దువ్వడం వల్ల కూడా హెయిర్ ఫాలో అవుతుంది. తడి స్కాల్ప్‌పై దువ్వడం వల్ల కుదుళ్లు వీక్ అవుతాయి. సున్నితంగా మారినప్పుడు జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది స్కాల్ప్‌పై ఒత్తిడిని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని తీవ్రతరం చేస్తుంది.
వర్షపు నీరు కూడా స్కాల్ప్‌కు హాని చేస్తుంది. ఎందుకంటే ఆ నీటిలో ఆమ్ల కాలుష్య కారకాలు, దుమ్ము ఉండొచ్చు. ఇవి తలపై చర్మానికి అంటుకుని క్యూటికల్స్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల చికాకు ఏర్పడి జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది.
చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. వర్షంలో తడిచి.. జుట్టును మళ్లీ వాష్ చేయరు. దీనివల్ల తలపై పేరుకున్న డర్ట్ జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది.
జుట్టు ఆరకపోయినా చాలామంది దానిని ముడి వేసుకోవడం లేదా గట్టిగా జడ వేసుకోవడం చేస్తారు. దీనివల్ల ఫంగస్ ఎక్కువ ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది.
వాతావరణంలో మార్పుల వల్ల హార్మోన్లు కూడా ప్రభావితమవుతాయి. దీనివల్ల సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు పెరిగి అవి కూడా జుట్టుపై నెగిటివ్‌గా ప్రభావం చూపిస్తాయి.